Thursday 14 June 2007
హై టెక్ స్యాలరీ ?
ఈరోజు మా మేనేజరు పిలిచి నీ జీతం పెంచాము అని చెప్పాడు. ఇంత పెంచి , బోల్డు పెంచినట్టు సీన్ చేసాడు. మార్కెట్ జీతం పరిశీలించాము అన్నాడు. బొంగు. ఉత్తిదే. నాకేమాత్రం సంతోషం గా లేదు. చాలా నిరాశగా ఉంది. ఇందుకా ఎనిమిదేళ్లు పైబడి ఈ కంపెనీని అంటిపెట్టుకున్నాను అనిపించింది మొదటిసారి.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
మీ మ్యానేజరు ఈ బ్లాగు చూశాడంటే పెంచింది పీకీగల్డు జాగ్రత్త సుమా :-)
హా.. ఆయనకి నేనిక్కడ ఉంటానని తెలిస్తేగా.. ఆయన కింద బోల్డు మంది ఉంటారు.. ఎవడో తెలీక జుట్టు పీక్కోవాలి.. జీతం కాదు. (అంటే అందరికీ తక్కువిచ్చాడనేగా అర్థం!) :)
"విహారి" అన్నట్టు జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు.
మనం ఏమిటి మన పరిస్తితి ఏమిటి అని మదింపు వెసుకుంటుండాలి.
ఈ బ్లాగు చదవండి. నా వాఖ్య కూడా వుందక్కడ. అది కూడా చూడండి.
http://tinyurl.com/26wnor
అలాగే శ్రమకు తగ్గ ఫలితం లేదేఅనుకుని అత్యాశకు వెడితే ఇప్పుదు జరుగుతున్నది ఇది.ది హిందు లో నిన్న వచ్హిన వ్యాసం ఇది.
http://tinyurl.com/2xvyyf
అనిల్ గారూ, మీరు పంపిన లింకులు చూసాను. థ్యాంక్సండీ. మీరు చెప్పింది కరెక్ట్. కెరీర్ పట్ల ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన సమయం వచ్చిందనే అనుకుంటున్నాను.
నా బ్లాగ్ గురించి: నా జాగ్రత్తలో నేను ఉన్నాను. నా పేరు బయటపెడితేగా.. తెలిసేది.
Post a Comment