Tuesday 12 June 2007

హై టెక్ సిటీ -- వాట్ ఏ పిటీ !!

నేను గత కొన్ని నెలల నుండి హైటెక్ సిటీ లో పని చేస్తున్నా. ముందు ఆహా ఓహో అనిపించినా , కొన్ని సమస్యలు ఉన్నాయింకా ... ఉదయం రష్ అవర్ లో సైబర్ టవర్స్ నుండి హైటెక్ సిటి వైపు ఎంతో మంది నడిచి పోతూ ఉంటారు .. కాని హాశ్చర్యం ! ఫుట్‌పాత్‌లే లేవు. రోడ్డు మీద ప్రమాదకరంగా నడవ్వలసిందే .. ప్రపంచ ప్రఖ్యాత హైటెక్ సిటీ లో ఫుట్‌పాత్‌లు లేవు .. వాట్ ఏ పిటీ...

రాత్రి పదిగంటలకు సైబర్ టవర్స్ వద్ద ట్రాఫిక్ ఇంకా రద్దీగా ఉంటూనే ఉంటుంది .. అయినా ఆ టైముకి ట్రాఫిక్ పోలీసులు మాయం.. అంతా గందరగోళం.. జామ్‌లు... ఇక కొంత మంది ప్రజలే పూనుకొని ట్రాఫిక్ కంట్రొల్ చెయ్యవలసి వస్తుంది... ఇదంతా ప్రపంచ ప్రఖ్యాత హైటెక్ సిటీలో.. వాట్ ఏ పిటీ ...

4 comments:

radhika said...

"ప్రపంచ ప్రఖ్యాత హైటెక్ సిటీలో" నిజం గా అంతుందా?

Lambodar said...

అవునండీ!!

Srinivas Akula said...

మరీ మీరు చెప్పినంత లేదు అనుకుంట?

Lambodar said...

అంటే హైటెక్ సిటీ గురించి మీరు గమనించింది కొంచం వివరంగా చెప్పండి శ్రీనివాస్ గారూ. నేనేదైనా తప్పుగా అభిప్రాయపడితే కరక్ట్ చేసుకుంటా.. థ్యాంక్స్.