మళ్లీ 'friday' వచ్చేసింది. ఇలా ఏడాదికి 52 సార్లు చొప్పున ,
10 ఏళ్లకి 520 సార్లు,
20 ఏళ్లకి 1040 సార్లు,
30 ఏళ్లకి 1560 సార్లు,
40 ఏళ్లకి 2080 సార్లు,
50 ఏళ్లకి 2600 సార్లు,
60 ఏళ్లకి 3120 సార్లు,
70 ఏళ్లకి 3640 సార్లు,
80 ఏళ్లకి 4160 సార్లు,
90 ఏళ్లకి 4680 సార్లు,
100 ఏళ్లకి 5200 సార్లు అనుకోవాలని తలుచుకొంటూ .. ఇంతటితో ఈ టపా కి సెలవ్.
;)
Friday 15 June 2007
Thursday 14 June 2007
హై టెక్ స్యాలరీ ?
ఈరోజు మా మేనేజరు పిలిచి నీ జీతం పెంచాము అని చెప్పాడు. ఇంత పెంచి , బోల్డు పెంచినట్టు సీన్ చేసాడు. మార్కెట్ జీతం పరిశీలించాము అన్నాడు. బొంగు. ఉత్తిదే. నాకేమాత్రం సంతోషం గా లేదు. చాలా నిరాశగా ఉంది. ఇందుకా ఎనిమిదేళ్లు పైబడి ఈ కంపెనీని అంటిపెట్టుకున్నాను అనిపించింది మొదటిసారి.
Tuesday 12 June 2007
హై టెక్ సిటీ -- వాట్ ఏ పిటీ !!
నేను గత కొన్ని నెలల నుండి హైటెక్ సిటీ లో పని చేస్తున్నా. ముందు ఆహా ఓహో అనిపించినా , కొన్ని సమస్యలు ఉన్నాయింకా ... ఉదయం రష్ అవర్ లో సైబర్ టవర్స్ నుండి హైటెక్ సిటి వైపు ఎంతో మంది నడిచి పోతూ ఉంటారు .. కాని హాశ్చర్యం ! ఫుట్‌పాత్‌లే లేవు. రోడ్డు మీద ప్రమాదకరంగా నడవ్వలసిందే .. ప్రపంచ ప్రఖ్యాత హైటెక్ సిటీ లో ఫుట్‌పాత్‌లు లేవు .. వాట్ ఏ పిటీ...
రాత్రి పదిగంటలకు సైబర్ టవర్స్ వద్ద ట్రాఫిక్ ఇంకా రద్దీగా ఉంటూనే ఉంటుంది .. అయినా ఆ టైముకి ట్రాఫిక్ పోలీసులు మాయం.. అంతా గందరగోళం.. జామ్‌లు... ఇక కొంత మంది ప్రజలే పూనుకొని ట్రాఫిక్ కంట్రొల్ చెయ్యవలసి వస్తుంది... ఇదంతా ప్రపంచ ప్రఖ్యాత హైటెక్ సిటీలో.. వాట్ ఏ పిటీ ...

నా బ్లాగులో ఏం రాయాలి?
ఏం రాయాలో బుర్ర చించుకుంటుంటే , నా ముందు కొన్ని ప్రత్యామ్నాయాలు కనిపించాయి.
1) కల్పిత మరియు ఊహా రచనలు - కథలు, కవిత్వం వగైరా (నా రచనలు)
2) విమర్శనాత్మక రచనలు - ఇతరుల కల్పిత రచనలు విమర్శించడం
3) అనుభవైక రచనలు - నా నిత్య, దైనందిన అనుభవాలు
4) వ్యాఖ్యలు - నేటి ప్రపంచం తీరు పై నా వ్యాఖ్యలు
ప్రస్తుతానికి నేను 3) మరియు 4) నే ఎంచుకున్నాను.

Monday 11 June 2007
నా మొదటి పోస్టు
ఇది ఒక గంగోత్రి ...
ఇది ఒక యమునోత్రి ...
ఇది ఒక తలకావేరి ...
ఇది ఒక మహాబలేశ్వరం ...
ఇది ఒక త్ర్యంబకేశ్వరం ...
ఇది ఒక యేరువాక పుట్టిల్లు ...
ఇది నా మొదటి పోస్టు ...
కొన్ని తెలుగు బ్లాగుల స్ఫూర్తితో ఈ బ్లాగు మొదలు పెట్టాను.
ఏం రాయాలో నిర్ణయించుకోలేదింకా ...
ఆలోచనలు ఊరుతున్నాయింకా...
చదివినా,చదవకపోయినా,
చూసినా,చూడకపోయినా,
విన్నా,వినకపోయినా,
నచ్చినా,నచ్చక పోయినా,
అరిగినా,అరగకపోయినా,
నా ఆలోచనలు త్వరలో ....

Subscribe to:
Posts (Atom)